• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ATMలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల పెట్టాలి..!

HYDలో వ్యాపారులకే కాదు, సాధారణ జనానికి సైతం చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ATM యంత్రాలలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ యంత్రాలు వాటికి అనుకూలించకపోతే అందుకు తగ్గ యంత్రాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. కాగా.. ఇప్పటికే ముంబైలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

March 1, 2026 / 12:56 PM IST

గిరిజన భవన్‌లో సాంప్రదాయ బద్ధంగా భోగ్ బండార్ కార్యక్రమం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్, భవాని అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించారు.

March 1, 2026 / 12:48 PM IST

అమరవీరుల త్యాగాలను మర్చిపోలేం: సునీల్ మాదిగ

KMM: ప్రజా సమస్యల పోరాటంలో అమరవీరుల త్యాగాలను మర్చిపోలేని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధిరలో మాదిగ అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలని చెప్పారు.

March 1, 2026 / 12:47 PM IST

సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన అదనపు DCP

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ప్రారంభించారు. క్రీడలతోనూ మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి అన్నారు. కేయూ సీఐ రవికుమార్, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, క్రీడాకారులు ఉన్నారు.

March 1, 2026 / 12:43 PM IST

చెరువులో పడి యువకుడు మృతి

KNR: పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజుల రాజేశ్ (36) శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఆందోళనతో వెతికిన కుటుంబ సభ్యులకు చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య రజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

March 1, 2026 / 12:41 PM IST

మోడల్ స్కూల్ టీచర్ అనుమానస్పద మృతి

RR: ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన సతీష్ కుమార్ ఆరుట్ల మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోని అద్దె ఇంటి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న అతడిని ఇబ్రహీంపట్నం మార్చురికి పోలీసులు తరలించారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 12:40 PM IST

కాలనీల సమస్యలకు నిధులు కేటాయిస్తాం : ఎమ్మెల్యే

SRD: కాలనీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 12:39 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన TPCC ప్రచార కమిటీ ఛైర్మన్

MNCL: బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ నాథరి స్వామి హాజరై ప్రారంభించారు. స్వామి మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానీసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు.

March 1, 2026 / 12:37 PM IST

TG ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడిగా సంజీవ

VKB: బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్‌కు చెందిన సంజీవ గౌడ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ గౌడ్ నియామకం పట్ల పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 12:35 PM IST

కృష్ణా నదిలో పడి బాలుడి మృతి

SRPT: చింతలపాలెం మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెల్లటూరు గ్రామ పరిధిలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలుడు ఇవ్వాళా ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందాడు. మృతుడు వెంకట్రాంపురం గ్రామానికి చెందిన బాలుడిగా గుర్తించారు. సరదాగా గడపడానికి వచ్చి విగతజీవిగా మారడంతో బంధువుల కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 12:34 PM IST

నిధుల మంజూరు

SDPT: ఎంపీ మాధవనేని రఘునందన్ రావును కొండపాక సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్, వార్డు సభ్యులు కలిసి గ్రామ సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ, గ్రామంలో నిలిచిపోయిన రోడ్డు పనులు, కొమురవెల్లి కమాన్ నుంచి కొండపాక వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. అలాగే పీహెచ్సీ భవన నిర్మాణం కోసం తక్షణ సాయంగా రూ.30 లక్షలు మంజూరు చేశారు.

March 1, 2026 / 12:34 PM IST

చేపల వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యం… కేసు నమోదు

MHBD: గార్ల మండల కేంద్రంలోని మహావీర్ రైస్ మిల్లు బజారుకు చెందిన నల్లమాస ఉపేందర్ ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య ఇందిరా తన భర్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ పేర్కొన్నారు.

March 1, 2026 / 12:33 PM IST

ఉమ్మడి జిల్లాలో తీవ్ర స్థాయికి చేరుకున్న కోతుల బెడద

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో కోతుల బెడద తీవ్ర స్థాయికి చేరుకుంది. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలో చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లి.. ప్రజల పై దాడి చేస్తున్నాయి. అలాగే రైతులు పండించిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నివారణ చర్యలు చేపట్టగా.. మరికొన్ని గ్రామాల్లో సమస్య అలానే ఉంది.

March 1, 2026 / 12:31 PM IST

యాక్సిడెంట్ కాకుండా డ్రైవింగ్ చేస్తే.. ప్రోత్సాహకాలు

HYD: యాక్సిడెంట్ లేకుండా ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇస్తారని మీకు తెలుసా?డ్రైవర్లలో భద్రతా చైతన్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెంగిచెర్ల డీఎం కవిత తెలిపారు. డిపో ఆర్.వెంకటేశ్వర్లు 30 ఏళ్లు 4 నెలలు ప్రమాదం లేకుండా సేవలందించి ప్రథమ స్థానం సాధించారు. ర్యాంక్ ప్రకారం ఫస్ట్ వస్తె రూ. 2,000, సెకండ్ రూ.1,750 ప్రకటించారు.

March 1, 2026 / 12:29 PM IST

‘ప్రజలకు చట్టాలపై అవగాహన అవసరం’

JGL: సంగెంలో నిర్వహిస్తున్న కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజుకు చేరుకుంది. NSS అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో’స్వచ్ఛ భారత్’ నిర్వహించి, పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం న్యాయవాది ప్రేమ్ సాగర్ హాజరై’ చట్టాలపై అవగాహన’ అనే అంశంపై ప్రసంగించారు. సమాజంలో శాంతి,సమానత్వం నెలకొల్పడానికి చట్టాలు దోహదపడాయన్నారు. 

March 1, 2026 / 12:27 PM IST