• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సమాజంలో అందరూ సోదర భావంతో మెలగాలి’

RR: బీఆర్ఎస్ ఎప్పుడు సర్వమత సమానత్వానికి కట్టుబడి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సయ్యద్ హఫీజ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సమాజంలో అందరూ సోదర భావంతో మెలగాలన్నారు. నియోజకవర్గంలో సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.

March 1, 2026 / 08:07 PM IST

‘సమిష్టి నిర్ణయాలతోనే అభివృద్ధి సాధించాలి’

ADB: సమిష్టి నిర్మాణాలతోనే సంఘం అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం రూరల్ మండలంలోని యాపాలగూడలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సమాజ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.

March 1, 2026 / 08:05 PM IST

తాడికల్ చెరువులో ఇష్ట రాజ్యాంగ మట్టి తవ్వకాలు

KNR: శంకరపట్నం మండలం తాడికల్ దొరసాని చెరువులో ఇష్టరాజ్యంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టితీతతో పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 1, 2026 / 08:05 PM IST

మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువుపొడిగింపు

BHNG: రాంపూర్ తండా మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ అంబటి శోభారాణి తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశం కోరే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

March 1, 2026 / 08:02 PM IST

సూర్యాపేటలో మీటర్ రీడర్ల నిరసన

SRPT: సూర్యాపేట విద్యుత్ సర్కిల్ ఆఫీసు ఎదుట మీటర్ రీడర్ల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్నా పీస్ రేటు విధానంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల పని దినాలు కల్పించాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యలు పరిష్కారం కాకపోతే విధులకు హాజరుకామని అన్నారు.

March 1, 2026 / 08:00 PM IST

ఇసుక క్వారీ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్

MNCL: అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన భీమారం మండలానికి చెందిన బేకరీ నిర్వాహకుడు వేముల శ్రావణ్ గౌడ్ పోలీసులకు చిక్కాడు. తనకు క్వారీ లభించిందని, పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు 62 మంది నుంచి దాదాపు రూ. 2 కోట్ల వరకు అప్పు తీసుకున్నాడు. అనంతరం పరారైన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

March 1, 2026 / 07:58 PM IST

చిన్నారి హత్యపై ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం

NGKL: పాలెం గ్రామంలో మూడు నెలల పసికందును నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన వారు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారు మాట్లాడుతూ.. అమానవీయంగా చిన్నారిని బలితీసుకున్న నిందితులను కటినంగా శిక్షించాలని ఆదేశించారు.

March 1, 2026 / 07:51 PM IST

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SRD: కొండాపూర్ మండలం అనంతసాగర్ మాజీ సర్పంచ్ అంకుశ ఇంద్రారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విట్టల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 07:46 PM IST

‘ఈనెల 15లోగా కథా రచనలను పంపాలి’

JGL: బడి పిల్లల కథా రచనలను ఈనెల 15లోగా డీఈవో కార్యాలయానికి పంపాలని, జగిత్యాల డీఈవో రాము తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు.

March 1, 2026 / 07:46 PM IST

కిష్టమ్మ ఎన్‌క్లేవ్ సమస్యల పరిష్కారానికి సూచనలు

MDCL: అల్వాల్ కిష్టమ్మ ఎన్‌క్లేవ్ కాలనీలో చెట్ల కొమ్మల కత్తిరింపు, వీధి దీపాల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పార్క్ సుందరీకరణ, సీసీ రోడ్డు నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని కాలనీ నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.

March 1, 2026 / 07:42 PM IST

జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపికైన క్రిష్ణ మోహన్

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి పామెన వార్డుకు చెందిన క్రిష్ణ మోహన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మక జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక చేశారు. అకాడమీ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు ఎంపికపత్రాన్ని HYDలోని జాతీయ కార్యాలయంలో అందుకున్నారు.

March 1, 2026 / 07:40 PM IST

మనస్థాపంతో ఒకరి ఆత్మహత్య

KMR: రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన శంకర్ మనస్థాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం..  కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ఆయన కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపం చెందగా.. తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

March 1, 2026 / 07:38 PM IST

‘కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్’

PDPL: కేంద్ర బడ్జెట్ కార్మికులు, కర్షకులు, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. యాకయ్య అన్నారు. మంథనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బడ్జెట్ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

March 1, 2026 / 07:37 PM IST

త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

RR: షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రజల అవసరాలను గుర్తించిన కౌన్సిలర్ రిజ్వానా బేగం ముబారక్ అలీ ఖాన్ బోర్ ఏర్పాటు చేశారు. బోర్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని వెంటనే పరిష్కారం చూపడం అభినందనీయమని ప్రశంసించారు.

March 1, 2026 / 07:37 PM IST

‘జిల్లా అభివృద్ధిలో శ్యామల దేవి సేవలు గొప్పవి’

ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసిన శ్యామల దేవి పదవి విరమణ పొందారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో శ్యామలాదేవి చేసిన సేవలు గొప్పవని అన్నారు. ప్రతి ఉద్యోగి వృత్తిలో నిమగ్నమై పని చేయాలని కోరారు.

March 1, 2026 / 07:34 PM IST