VKB: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ దీపక్ తివారీ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి.. ఆదివారం కొడంగల్‌లో పర్యటించారు. R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు.
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పలు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులుప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయం, పెద్దమ్మ ఆలయం అభివృద్ధి, సీసీ రోడ్లు, గుండ్లపల్లె తెలుగు పల్లె నుంచి గ్రామాన్ని కలిపే ఒర్రె మీదుగా సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.
MDCL: భవిష్యత్ యుద్ధ స్వభావం సాంకేతికత ఆధారంగా మారుతోందని ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నీ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ఎంసీఏఎంఈలో రోబోటిక్స్, అటానమస్ డ్రోన్ సిస్టమ్స్, సంకలిత తయారీపై రెండు రోజుల సెమినార్ నిర్వహించారు. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఆధ్వర్యంలో రక్షణ దళాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జిల్లా వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. TNGO ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్ రెడ్డి, JAC కన్వీనర్ TGO ప్రెసిడెంట్ మడిపల్లి కాళిచరణ్ పాల్గొన్నారు.
NRPT: జిల్లాలో ఇవాల్టి నుంచి ఈనెల 31 వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక, విద్యార్థి, రైతు సంఘాల నేతలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు.
SRPT: నాగారం మండల కేంద్రంలో ప్రగతి నగర్ స్టేజ్ వద్ద ఆదివారం ఆగి ఉన్న హార్వెస్టర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అనాజిపురంకు చెందిన కొల్లు యాదయ్య ద్విచక్ర వాహనంపై తిరుమలగిరి నుండి సూర్యాపేట వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి ఏరియా ఆసుపత్రిలోనే ఫిర్యాదు స్వీకరించారు.
WNP: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సీఎం కప్ తైక్వాండో పోటీల్లో వనపర్తి జిల్లా కొత్తకోట విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జిల్లా నుంచి పాల్గొన్న 27 మందిలో ఇద్దరు రజత, నలుగురు కాంస్య పతకాలు సాధించారు. విజేతలను కొత్తకోట మున్సిపల్ ఛైర్మన్ పి. అరుణ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ పి. పల్లవి కృష్ణారెడ్డి అభినందించారు.
BDK: గిరిజన పల్లెలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను (CHC) రూ. 10.70 కోట్ల భారీ వ్యయంతో 30 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. గిరిజన బిడ్డలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయల వ్యాయాయంతో నిర్మాణం చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, అధికారులు ఉన్నారు.
వికారాబాద్ అనంతగిరి హరిత రిసార్ట్‌లో గత పది రోజులుగా జరుగుతున్న డీసీసీల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ రానున్నారు. సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అనంతగిరి నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు. సాయంత్రం నాలుగు 30 గంటల వరకు హరిత రిసార్ట్‌లో ఉంటారు.
MBNR: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్‌లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. ఒకినావా స్పోర్ట్స్ కరాటే ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అండర్-11 విభాగంలో వంశీ బంగారు పతకం సాధించగా, అండర్-12 విభాగంలో చంద్రకళ వెండి పతకం కైవసం చేసుకుంది. అలాగే మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు.
KMM: భూధాన్ భూముల్లో ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్న వారిని అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి పేదలను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
SDPT: బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామ దేవతలైన పోచమ్మ తల్లి, అంతగిరి పోచమ్మ తల్లికి బోనాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. ప్రతి కుటుంబం ఒక బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ముందు ఈ వేడుకలు జరిపారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, పంటల సమృద్ధి కోసం తల్లులను ప్రార్థించారు.
MDK: చేగుంటలో డబ్బుల కోసం భార్య వరలక్ష్మి పారతో కొట్టి హత్య చేసిన భర్త త్రిమూర్తులును అరెస్టు చేసినట్లు రామాయంపేట్ సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. 2015లో వరలక్ష్మిని రెండో వివాహం చేసుకోగా దుర్గాప్రసాద్ (10) జన్మించాడు. భార్యను డబ్బుల 21న రాత్రి నిర్దిస్తున్న సమయంలో పారతో కొట్టి చంపినట్లు తెలిపారు. అనంతరం బంగారు నగలు, నగదుతో పరారయ్యారన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ సమావేశం వంగరి ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని సమాజంలోని రుక్మతల తొలగించడానికి, సమాజ మార్పు కొరకు ఉపయోగించాలని అన్నారు. సమాచార హక్కు చట్టం సామాన్యుని వజ్రాయుధమని అన్నారు.