• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వార్షిక మహోత్సవానికి విచ్చేయాలని ఆహ్వానం

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చిట్యాల శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4న జరిగే దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉత్సవాలను ప్రారంభించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసి, కరపత్రాలను ఎమ్మెల్యేతో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:11 PM IST

రూ. 500 కొత్త నోటును చూస్తే హడల్

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు రూ.500 కొత్త నోట్లను చూస్తే హడలిపోతున్నారు. పట్టణంలో ఇటీవల రూ. 500 నకిలీ నోటు చలామణి కావడం సంచలనంగా మారిన విషయం తెలిసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వ్యాపారులలో భయం పోలేదు. తమ దుకాణాలకు వస్తున్న రూ. 500 నోట్లను పరిశీలించి తీసుకుంటున్నారు.

March 1, 2026 / 02:10 PM IST

సీతారాముల కళ్యాణ ఉత్సవ కమిటీ ఎన్నిక

KNR: హుజురాబాద్ మండలం బోర్నపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గ్రామస్తులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మసాడి సంపత్ రావు, ఉపాధ్యక్షులుగా పిల్లి గణేశ్, సంపత్ ప్రధాన కార్యవర్గ సభ్యులుగా జూపక శ్రీనివాస్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.

March 1, 2026 / 02:08 PM IST

ఆత్మరక్షణకు కరాటే అవసరం: సర్పంచ్

BDK: భద్రాచలం గిరిజన బాలికల స్కూల్ లో సుమన్ షోటోకాం స్పోర్ట్స్ కరాటే – డో అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. యువతి యువకులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. అలాగే ఆత్మ రక్షణకు కరాటే అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:08 PM IST

హోలీ రోజే చంద్రగ్రహణం.. బ్రాహ్మణ సంఘం ప్రకటన

VKB: రాబోయే హోలీ పండుగ, చంద్రగ్రహణ సమయాలపై వికారాబాద్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్యోషి సుభాశ్ చంద్రకాంత్ శర్మ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించిన ప్రమాణాల మేరకు మార్చి 2న కామదహనం, మార్చి 3న హోలీ జరుపుకోవాలని సూచించారు. అదేరోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుందని తెలిపారు.

March 1, 2026 / 02:07 PM IST

ఆదివాసీల సమస్యలపై మంత్రికి వినతి

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు ఆదివారం సచివాలయంలో కలిశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విన్నపాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆనంద్ రావు తెలిపారు.

March 1, 2026 / 02:05 PM IST

మున్సిపల్ వైస్ ఛైర్మన్‌కు ఘన సన్మానం

NRML: నిర్మల్ మున్సిపల్ నూతన వైస్ ఛైర్మన్ అప్పల గణేష్‌ను 1993–1996 B.Sc, BZC బ్యాచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిత్రబృందం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కంకేట మాజీ సర్పంచ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 02:05 PM IST

‘ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అమరుల త్యాగం మరువలేనిది’

SRPT: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అసువులు బాసిన అమరుల త్యాగం మరువలేనిదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందుకూరి సోమన్న మాదిగ అన్నారు. ఆదివారం తిరుమలగిరిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే మాదిగ అమరవీరులకు నిజమైన నివాళి అన్నారు.

March 1, 2026 / 02:01 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన కోస్లి సర్పంచ్

NZB: నవీపేట్ మండలం కోహ్లి సర్పంచ్ బాబు సింగ్ ఆదివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి పనులకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 1, 2026 / 02:01 PM IST

గోవులపై చిన్నతనం నుంచే అపార ప్రేమ : డిప్యూటీ మేయర్

MBNR: హన్వాడ మండలం చిన్నదర్పల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోశాలలోని గోవులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గోవులపై చిన్నతనం నుంచే తనకు అపారమైన ప్రేమ ఉందని, గోశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, గోశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

March 1, 2026 / 01:47 PM IST

నెరవేరిన పేదల సొంతింటి కల

SRCL: ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలంలోని మల్కపేట, మర్తన్నపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

March 1, 2026 / 01:45 PM IST

మేయర్ పీఠం పై రాజకీయ నేతల వారసులు గురి

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే మేయర్ సీటు జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో రాజకీయ నేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఈ సీటు పై గురి పెట్టగా, వారి కుమారులు, కుమార్తెలు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మేయర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

March 1, 2026 / 01:38 PM IST

ఒకటో నెంబర్ గనిలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి

PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-1 గనిలో ప్రొడక్షన్ డే ఆదివారం విజయవంతంగా ముగిసిందని GM లలిత్ కుమార్ తెలిపారు. 806 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 736 టన్నుల డిస్పాచ్ సాధించి,1.2 OMS సాధించడం జరిగిందన్నారు. ఇవాళ బొగ్గు ఉత్పత్తి అత్యధిక రికార్డుగా నిలిచిందన్నారు. ఒకరోజు నిర్దేశించిన లక్ష్యం 656 టన్నులు కాగా, లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించిన ఉద్యోగులను, సిబ్బందిని అధికారులు అభినందించారు.

March 1, 2026 / 01:37 PM IST

భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలి: ఆడే గజేందర్

ADB: చెడు వ్యసనాలకు బానిస కాకుండా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహించిన శబరిమాత రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

March 1, 2026 / 01:37 PM IST

శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు

VKB: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎగ్జిబిట్స్ ఉపయోగ పడతాయని సర్పంచ్ డీవై నర్సింహులు, ఉప సర్పంచ్ ప్రసాద్ అన్నారు. శనివారం పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ డేను నిర్వహించారు. విభిన్న అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, శంకర్, తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 01:36 PM IST