MNCL: బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ నాథరి స్వామి హాజరై ప్రారంభించారు. స్వామి మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానీసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు.