VKB: బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్కు చెందిన సంజీవ గౌడ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ గౌడ్ నియామకం పట్ల పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.