మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్, భవాని అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించారు.