తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయ...