Group-1 prelims పేపర్ రద్దు, బోర్డు ప్రకటన.. డీఏవో, ఏఈ పరీక్ష కూడా క్యాన్సిల్
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్‌ను టీఎస్పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. ఇంతకుముందే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది.
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్‌ను టీఎస్పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని తెలిపింది. ఏఈ, డీఏవో పేపర్ నిర్వహించే తేదీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది. గతేడాది సెప్టెంబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు జూనియర్ లెక్చరర్స్ పరీక్షను కూడా టీఎస్ పీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీలో (TSPSC paper leak) ప్రధాన నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో (Praveen pen drive) మొత్తం 5 పేపర్లను గుర్తించారు. వాటిలో ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ ఎగ్జామ్ పేపర్ల పరీక్ష జరగలేదు. ఫిబ్రవరి 27వ తేదీన ప్రవీణ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. విపక్షాలు కూడా కదం తొక్కాయి. వైఎస్ షర్మిల బోర్డు ముట్టడిగా ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అమరవీరులకు నివాళి అర్పించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడని తెలిసింది. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నారని సమాచారం. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు ఇప్పటికే కూపీ లాగారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.