Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.
Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని.. అందుకే బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆటో డ్రైవర్ (Auto driver) ప్రతినిధులు చెబుతున్నారు.
ఆటో చార్జీ పెంపు (charge hike), డ్రైవర్ల సమస్యలు (driver problems), ఇబ్బందులను పరిష్కరించాలని ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ డిమాండ్ చేశారు. జంట నగరాల్లో అన్ని వైపుల రోడ్లను దిగ్బంధిస్తామని చెప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించరు కానీ.. వారి అవసరాలను తీర్చుకుంటారా అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్తో (andhra pradesh) సమానంగా ఆటో మీటర్ ఛార్జీలు (auto meter charge) పెంచాలని, ప్రతీ ఆటోకు (auto) యాన్యువల్ బీమా సర్టిపికెట్ చార్జీ, ఇతర ఖర్చుల కోసం రూ.10 వేలు అందజేయాలని కోరారు. ఢిల్లీలో (delhi) మాదిరిగా బైక్, ట్యాక్సీలపై నిషేధం విధించాలని కోరారు. కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిజిస్ట్రేషన్ బదులుగా ఇప్పటికే ఉన్న అన్ని ఆటోలను గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చాలని కోరారు. ప్రైవేట్ ఆటో ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖ నుంచి వేధింపులను అరికట్టేందుకు మార్గదర్శకాలు జారీచేయాలని డిమాండ్ చేశారు.
కొత్త సచివాలయం (secretariat) ఏప్రిల్ 30వ తేదీన మేష లగ్న (mesha lagna) సుముహూర్తన ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు ఉదయం 06.08 గంటలకు వేద పండితుల సమక్షంలో సీఎం కేసీఆర్ (cm kcr) ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నాం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) తన సీటులో ఆశీనులు అవుతారు. మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి 3.30 గంటల మధ్య మంత్రులు (ministers) సీట్లలో కూర్చుంటారు. కొత్త సచివాలయానికి సంబంధించి ఇప్పటికే త్రిడి యానిమేషన్ (3d animation) వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయ నిర్మాణం కోసం రూ.400 కోట్లు (400 crores) అని తొలుత అనుకున్నారు. కానీ నిర్మాణ వ్యయం క్రమంగా పెరిగింది. రూ.1200 కోట్లకు (1200 crores) చేరింది. సచివాలయాన్ని షాపూర్జీ పల్లొంజి సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.