»Another Shocking News To Mlc Kavitha On Supreme Court Delhi Liquor Scam Case
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు మరో దెబ్బ..ఆందోళనలో కవిత!
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC kalvakuntla kavitha) మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ(ED) మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ముందుగా చెప్పిన ప్రకారం మార్చి 24న మాత్రమే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే తన పిటిషన్ సుప్రీంకోర్టు(supreme court)లో పెండింగ్ ఉందని చెప్పి గురువారం కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. అయినా కూడా మార్చి 20న మళ్లీ హాజరుకావాలని ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఏం చేసి ఈడీ విచారణ నుంచి తప్పించుకోవాలని కవిత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణను గతంలో వాయిదా వేసిన కవిత మార్చి 20వ తేదీ రోజు ఏం చేస్తోందో చూడాలి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల((mlc kavitha) కవిత గురువారం రెండోసారి ఈడీ(ED) విచారణకు హాజరుకాలేదు. ఒక మహిళగా తనను విచారణ కోసం కార్యాలయానికి పిలిపించరాదని, అరెస్టు, సమన్ల నుంచి రక్షణ కల్పించాలంటూ..ఆమె శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును కోరింది. తన అప్పీల్పై తీర్పు వెలువరించే వరకు ఏజెన్సీ తనపై విచారణను వాయిదా వేయాలని కవిత ఈడీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. కానీ ఈడీ(ED) అందుకు నిరాకరించకలేదు. మళ్లీ మార్చి 20న ఈడీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఓ మహిళను ఈడీ కార్యాలయానికి(ED office) పిలిపించడాన్ని సవాల్ చేస్తూ తాను ఇప్పటికే సుప్రీంకోర్టు(supreme court)కు వెళ్లానని గుర్తు చేశారు. ఈ నెల 24న సుప్రీంకోర్టు(supreme court) తన కేసును విచారించే అవకాశం ఉందన్నారు. ఏదైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకుంటే తనకు ఈ-మెయిల్ చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమ భరత్ కుమార్ ఈడీ(ED) కార్యాలయానికి తీసుకెళ్లి లేఖ సమర్పించారు. లేఖను పరిశీలించిన కొద్దిసేపటికే, ఈడీ అధికారులు కవితకు మార్చి 20, సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతూ కవితకు మరో లేఖ పంపారు. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్పై విచారణ జరిగే వరకు స్టే ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైని గురువారం ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ, కవిత(kavitha)తో పాటు ఆయన్ను ముఖాముఖిగా విచారించాలని పేర్కొంది. కానీ కవిత రాకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం అరుణ్ పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మార్చి 20వ తేదీ ఉదయం కవిత, అరుణ్ పిళ్లై మధ్య ఈడీ ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజానిజాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్ట్(arrest) చేసే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు.