»Mlc Not Wrong Why Are You Avoiding Ed Inquiry Bjp Mp K Laxman Comments On Mlc Kavitha
MP Laxman: కవిత తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుంటున్నారు?
తెలంగాణ సీఎం కేసీఆర్(c కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(ED) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM kcr) కుమార్తె ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(Ed) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కానీ ఈడీ విచారణను ఎదుర్కొంటామని చెప్పిన కవిత మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తప్పుచేయకపోతే మీరు విచారణను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావాలని సూచించారు. ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా చట్టం దృష్టిలో సమానమేనని…తప్పుచేస్తే మాత్రం శిక్షతప్పదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మహిళల బిల్లు పేరుతో ఆందోళన చేయడం సహా అనేక అంశాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు తెలంగాణలో TSPSCలో పేపర్ లీక్(paper leak tspsc) అంశంపై కేసీఆర్(kcr) ప్రభుత్వంపై మండి పడ్డారు. ఈ లీకేజీ కేసులో అసలు పెద్ద బయటకు రావాలని అన్నారు. పెద్దల మద్దతు లేకుండానే అసలు TSPSCలో అంతా ఈజీగా పేపర్ లీకేజీ అయ్యే అవకాశం ఉండదన్నారు. అనేక సెట్ పేపర్లు ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఓ ఉద్యోగి పరీక్ష కరెక్టుగా నిర్వహించే పేపర్లను ఎలా తస్కరించాడని నిలదీశారు. ఇలాంటి క్రమంలో ఈ కేసును సిట్(SIT)కు అప్పగించి తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సిట్ పేరుతో గతంలో అనేక కేసులను తప్పుదారి పట్టించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో సిట్ దర్యాప్తు చేపట్టిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ, తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ సహా అనేక కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల((mlc kavitha) కవిత గురువారం ఈడీ(ED) విచారణకు హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విచారణలో ఒక మహిళగా తన పట్ల ED వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తూ లేఖ కూడా రాశారు. తాజా సమన్లలో ఎక్కడా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ పేర్కొనలేదని కవిత అన్నారు. ఓ మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాల్ చేస్తూ తాను ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. ఈ నెల 24న సుప్రీంకోర్టు(supreme court) తన కేసును విచారించే అవకాశం ఉందన్నారు. ఏదైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకుంటే తనకు ఈ-మెయిల్ చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా..ఆమె హాజరుకాలేదు.
కవిత రాసిన లేఖను బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమ భరత్ కుమార్ ఈడీ(ED) కార్యాలయానికి తీసుకెళ్లి లేఖ సమర్పించారు. లేఖను పరిశీలించిన కొద్దిసేపటికే, ఈడీ అధికారులు కవితకు మార్చి 20, సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతూ కవితకు మరో లేఖ పంపారు. ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్పై విచారణ జరిగే వరకు స్టే ఇవ్వాలన్న కవిత అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైని గురువారం ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచిన ఈడీ, కవితతో పాటు ఆయన్ను ముఖాముఖిగా విచారించాలని పేర్కొంది.
కానీ కవిత రాకపోవడంతో ప్రత్యేక న్యాయస్థానం అరుణ్ పిళ్లై కస్టడీని మార్చి 20 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మార్చి 20వ తేదీ ఉదయం కవిత, అరుణ్ పిళ్లై మధ్య ఈడీ ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజానిజాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత వీలైనంత వరకు ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.