• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’

KMR: రాజంపేట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

February 20, 2026 / 01:28 PM IST

జిల్లాస్థాయి భజన పోటీలో మిడ్జిల్‌కు రెండో బహుమతి

MBNR: జడ్చర్ల మండలం కుర్వగడ్డ పల్లి గ్రామంలోని శ్రీ పరుశవేధిశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మిడ్జిల్కి చెందిన శ్రీ మాత ఇద్దమ్మ దేవి భజన మండలి రెండో బహుమతి సాధించింది. నిర్వాహకులు విజేతలకు రూ.80,106తో పాటు మెమొంటో అందజేసి అభినందించారు. భక్తుల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

February 20, 2026 / 01:27 PM IST

ప్రగతి కాంతులతో విరజిముతున్న కాలనీలు

RR: నందిగామ గ్రామపంచాయతీలో కాలనీలు ప్రగతి కాంతులతో విరజిమ్ముతున్నాయి. సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆదేశాల మేరకు ఏడవ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో వార్డులో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.

February 20, 2026 / 01:26 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

VKB: తాండూరు పట్టణ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్‌తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో లబ్ధిదారకు అందజేయున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.

February 20, 2026 / 01:26 PM IST

ప్రయత్నమే విజయానికి మార్గం: సీపీ

KMM: ప్రయత్నమే విజయానికి మార్గమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ – 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆవరణలో నిర్వహించారు. ఈ రాష్ట్రస్థాయి అర్చేరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

February 20, 2026 / 01:25 PM IST

81వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్‌ లో ముంపునకు గురి అవ్వద్దని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 81 రోజులకు చేరుకున్నాయి. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ ను రద్దు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు మా భూములు మాకు కావాలని, మా ఇండ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.

February 20, 2026 / 01:24 PM IST

అమీర్పేట్లో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ మళ్లింపులు

HYD: అమీర్పేట్‌లో నీలగిరి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మైత్రివనం జంక్షన్ నుంచి సత్యం థియేటర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపుకి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.

February 20, 2026 / 01:23 PM IST

గ్రామాల సమగ్రాభివృద్ధికి సహకరించాలి: MLA

HNK: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజలు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తరాలపల్లి అభివృద్ధికి సహకరిస్తానని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 01:19 PM IST

మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

KNR: జమ్మికుంట మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని ఉన్నత శ్రేణి కార్య దర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 44 వాహనాల్లో 368 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ. 6,300ల ధర పలికింది. పత్తి ధర నిన్నటి కంటే రూ. 50 తగ్గింది.

February 20, 2026 / 01:19 PM IST

BRS కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి

సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పుకొచ్చారు.

February 20, 2026 / 01:18 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌ను సన్మానించిన మాజీ వైస్ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్‌ను మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

February 20, 2026 / 01:18 PM IST

నెక్కొండలో గృహప్రవేశానికి హాజరైన: ఎమ్మెల్యే

WGL: నెక్కొండ (M) కేంద్రంలోని పత్తిపాక తండాకు చెందిన బి రజిత–లక్ష్మణ్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని MLA దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సం,రాలు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.

February 20, 2026 / 01:17 PM IST

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

NZB: రాజంపేటలో 157వ బూత్ బీజేపీ అధ్యక్షుడు జూకంటి రాజిరెడ్డి తండ్రి, సోదరుడు ఇటీవల అకాల మరణం చెందడంతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనతో బాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:16 PM IST

నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరణ

GDWL: మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. అందరి సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

February 20, 2026 / 01:11 PM IST

‘టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలి’

MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.

February 20, 2026 / 01:07 PM IST