HYD: అమీర్పేట్లో నీలగిరి భవన్లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మైత్రివనం జంక్షన్ నుంచి సత్యం థియేటర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపుకి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.