»Cm Kcr Exgratia To Secunderabad Swapnalok Complex Dead 6 People
Swapnalok Complex:మృతులకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని హోమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ తెలిపారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్(Swapnalok complex) లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల (22), వెన్నెల (22), శ్రావణి (22), త్రివేణి (22), శివ (22), ప్రశాంత్ గా (23) గుర్తించారు. మృతుల్లో వరంగల్ కు చెందిన ముగ్గురు, ఖమ్మంకు చెందిన ఒకరు, మహబూబాబాద్ వాసులు ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనలు పలువురికి గాయాలు అయ్యాయి. వారిని అపోలో, యశోద హాస్పిటల్స్(hospital)కు తరలించారు.
గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు మంటలు(fire) అంటుకున్నాయి. ఎనిమిది అంతస్తుల ఈ భవనంలో(building) మొదట ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. భవనంలో తొలుత మంటలు చెలరేగి, ఆ తర్వాత ప్రయివేట్ ఆఫీస్ లు ఉన్న నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు వ్యాప్తించాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది పలువురిని కాపాడింది. స్పృహ కోల్పోయిన వారిని గాంధీ హాస్పిటల్ తరలించారు. నాలుగు గంటల పాటు శ్రమించి, మంటలను ఆర్పేశారు.
ఇక్కడ బట్టల దుకాణాలు(shops), కాల్ సెంటర్లు, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్, కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు ఉన్నాయి. స్వప్న లోక్ కాంప్లెక్స్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఒక్కసారిగా మంటలు రావడంతో యజమానులు, ఉద్యోగులు, పని చేసేవారు, షాపింగ్ కోసం వచ్చిన వారు కిందకు పరుగు పెట్టారు. మంటల్లో పదిహేను మంది వరకు చిక్కుకున్నారు. వారిని భారీ క్రేన్లతో బయటకు తీసుకు వచ్చారు. శ్రావణ్, భారతమ్మ, సుధీర్ రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. వీరు దాదాపు నాలుగు గంటల పాటు పొగ(smog)లో చిక్కుకున్నారు.