అన్యాయం జరిగిన చోట నిరసన జ్వాలలు రేగడం సాధారణం. కానీ ఏకంగా పరిపాలన సాగే సెక్రటేరియట్ లాంటి చోట నిరసన అంటే పెద్ద విషయమే. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారే నిరసనకు దిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తెలంగాణ సెక్రటేరియట్ లోమహిళా హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. సూపర్వైజర్లు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, చెప్పుకోలేని విధంగా దుర్భాషలు ఆడుతున్నారని, మాట వినకపోతే ఉద్యొగం నుండి తొలిగిస్తామని బెదిరిస్తున్నారని లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో నిరసనకు దిగారు.
హౌస్ కీపింగ్ కార్మికులు అంతా థర్డ్ పార్టీ సంస్థ ద్వారా సెక్రటేరియట్ లో విధులు నిర్వరిస్తున్నారు. అక్కడ చేస్తున్న ఆందోళనలు గురించి ఆ సంస్థకు పిర్యాదు చేసారు సెక్రటేరియట్ ఉన్నతాధికారులు., కానీ ఉపయోగం లేకపోయింది. తెలంగాణ అధికారులకు వారు అందుబాటులోకి రాలేదు. ఈ ఆందోళనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.