»Birthday Celebration On Delhi Roads Nh 24 Youtuber Prince Dixit Arrested
Violating Traffic Rules: ఢిల్లీ రోడ్లపై బర్త్ డే సెలబ్రేషన్స్..యూట్యూబర్ అరెస్ట్
ఢిల్లీ(delhi) రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి(violating traffic rules) పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రిన్స్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు(police) అరెస్ట్ చేశారు. ఓ వైరల్ వీడియో(video)లో కొంతమంది వ్యక్తులు యూట్యూబర్(prince dixit) పుట్టినరోజు సందర్భంగా పాండవ్ నగర్ సమీపంలో NH-24లో కార్ల(car) పైకప్పుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం కనిపించింది. ఆ వీడియో వైరల్(video viral) కావడంతో, పోలీసులు యూట్యూబర్‌ను పట్టుకున్నారు.
దేశరాజధాని ఢిల్లీ(delhi) రోడ్లపై అర్థరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఓ ఇండియన్ యూట్యూబర్ పై అక్కడి పోలీసులు(police) కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే NH-24పై కదులుతున్న కార్ల పైకప్పుపై నిలబడి, ట్రాఫిక్ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూ(violating traffic rules) యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్(prince dixit) తన సహచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతేకాదు ప్రయాణిస్తున్న కార్ల నుంచి బయటకు వచ్చి వారు వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఢిల్లీ రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. వారు అర్ధరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్(birthday celebrations) చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్(video viral)గా మారింది. అది ఆలస్యంగా గమనించిన పోలీసులు ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకున్నారు.
Cognizance of the matter has been taken. We are inquiring into it to identify the offenders & to get the details of the time of incident. Appropriate legal action shall be taken against the offenders.
DM us to identify the offenders. Your anonymity shall be maintained. https://t.co/6dy1LHqvJx
అయితే పాండవ్ నగర్‌కు సమీపంలో ఉన్న NH-24లో కదులుతున్న కార్లపై నిలబడి యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్(prince dixit), అతని స్నేహితులు గత ఏడాది నవంబర్‌లో పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో పోలీసులు దీక్షిత్(prince dixit)ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలో యూట్యూబర్, అతని స్నేహితులు(friends) వేగంతో డ్రైవింగ్(driving) చేస్తున్నప్పుడు కదులుతున్న కార్లపై నిలబడి బిగ్గరగా అరవడం, మ్యూజిక్ ప్లే చేయడం చూడవచ్చు. మరోవైపు ఆ వేడుకల్లో పాల్గొన్న దీక్షిత్ స్నేహితుల కోసం కూడా వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబర్ 16న వీడియో తీసినట్లు ప్రిన్స్ పోలీసుల(delhi police) విచారణలో అంగీకరించాడు. తన పుట్టినరోజు సందర్భంగా NH24 నుంచి షకర్పూర్కు ప్రయాణిస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసినట్లు వెల్లడించాడు.