»Birthday Celebrations For Kodipunju At Visakhapatnam Viral News
Kodipunju:కు బర్త్ డే వేడుకలు..500 మందికి మాంసాహార విందు
ఇటివల కాలంలో పెంచుకున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించడం ట్రెండ్ గా మారుతుంది. వాటిలో శునకాలు, పిల్లి, గాడిద, గుర్రం వంటి వాటికి ఇప్పటికే జరుపగా..ఆ జాబితాలో తాజాగా కోడి కూడా చేరింది. అవునండి బాబు ఇటివల కోడిపుంజుకు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
Birthday celebrations for Kodipunju at visakhapatnam viral news
ఏపీ విశాఖపట్నం(visakhapatnam)లోని చీమలపల్లి గ్రామంలో ఓ కుటుంబం కోడిపుంజు(Kodipunju)కు బర్త్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. 2017లో ఆ ఫ్యామిలీ ఐదు రూపాయలతో ఓ కోడిపిల్లను కొనుగోలు చేసి దానికి చిక్కు అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత దానిని వారి కుటుంబంలో ఒక సభ్యురాలి మాదిరిగా భావిస్తు జాగ్రత్తగా పెంచుకున్నారు. అంతేకాదు వారు రెస్టారెంట్, ఇతర ఊర్లకు వెళ్లినా కూడా దానిని తీసుకెళ్లేవారు. అలా వారితో పాటు జీవిస్తున్న దాని తీరు గురించి చిక్కు అనే యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేసి దాని వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు.
ఆ కోడిపుంజుకు మంచి ఆహారం అందిస్తున్నారు. రాత్రిపూట ఏసీ గదిలో పడుకోబెడుతున్నారు. వారు భోజనం చేసే సమయంలో దానికి కూడా ఫుడ్ వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈనెల 20న చిక్కుకు కోటేశ్వర రావు, కవిత దంపతులు పుట్టినరోజు వేడుకలు(Birthday celebrations) జరిపారు. అంతేకాదు దాదాపు 500 మందిని ఆహ్వానించి మాంసాహారాలతో విందు భోజనాలు కూడా వడ్డించారు. అయితే ఈ విషయం తెలిసిన పలువురు ఇదేమి విడ్డూరమని కామెంట్లు చేస్తున్నారు. మీకు డబ్బు ఎక్కువగా ఉంటే ఎవరైనా నిరుపేదలకు దానం చేయండి. కానీ ఇలా జంతులకు వింత అచారాలు, అలవాట్లను చేయోద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.