MHBD: పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న సూచించారు. నిన్న నెల్లికుదురు మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్లతో కలిసి సందర్శించారు. విద్యార్థులు మంచి లక్ష్యం ఎంచుకొని ఎదగాలని, అప్పుడే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు.