PLD: టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సాంబశివరావు నియమితులయ్యారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికి టీడీపీలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి ఈ పదవి దక్కేలా కృషి చేసిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.