E.G: చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజమండ్రి లో మంత్రి కందుల దుర్గేష్ ఆయనను ఘనంగా అభినందించారు. తెలుగుతో పాటు కన్నడ నాట కూడా రఘునాథ్ తన సాహితీ సేద్యాన్ని కొనసాగించాలని మంత్రి ఆకాంక్షించారు. దశాబ్దాలుగా భాషా సేవలో నిమగ్నమైన రఘునాథ్ కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.