ATP: పామిడి మండలంలో కందిపంటను సాగు చేసిన రైతులు కందుల అమ్మకానికి పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి విజయ్ కుమార్ సూచించారు. అప్పాజిపేటలో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనవరి రెండవ వారం నుంచి క్వింటా కందులు రూ.8వేలతో కొనుగోలు చేస్తామన్నారు.