KNR: ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సుదీర్ఘకాలపు సమస్య పరిష్కారమైంది. PHD, ఎంఫిల్ అర్హతలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు పదోన్నతి పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నేరుగా నియామకమైన వారితో సమానంగా ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు వచ్చేలా కృషి చేసిన TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు.