జగిత్యాల(D) ఎండపల్లి(M) అంబరిపేటలో నూతన పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సర్పంచ్ దర్శనాల నరేష్ ఆధ్వర్యంలో JAN 1, 2026 నుంచి గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి రూ. 20 వేలు, రెండోసారి రూ. 30 వేలు, మూడోసారి రూ. 50 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.