TG: తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని జాగృతి అధ్యక్షురాలు కల్వకంట్ల కవిత పేర్కొన్నారు. పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, తిరిగి BRSలో చేరేది లేదని స్పష్టంచేశారు. ఈ మధ్యలో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో దిగుతామని వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడనని తెలిపారు.