ADB: నార్నూర్ మండలంలోని భీంపూర్, కొలాంగూడ గ్రామంలో బుధవారం సీఐ అంజమ్మ సందర్శించారు. పేద కొలాం కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు దుప్పట్లు అందజేశామని ఆమె సూచించారు. చలికాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.