SKLM: కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ సంస్థ, ఆర్ట్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.