ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఐపీఎస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో కలిసి కృష్ణలంకలోని (NHAI) కార్యాలయంలో రీజినల్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ సింగ్ ఐఈఎస్ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.