»Discord Incident In Kcr Birthday Celebrations At Amberpet
KCR జన్మదిన వేడుకల్లో అపశ్రుతి.. ఎమ్మెల్యే పరుగులు
భారీగా బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు అక్కడ కట్టిన బెలూన్లపై పడ్డాయి. అలంకరణపై బెలూన్లు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో అందరూ భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ చెదురుముదురుగా వెళ్లిపోయారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao) జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)గా అవతరించడంతో ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బాణసంచా (Crackers) పేలుడుతో మంటలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లోని అంబర్ పేట (Amberpet) నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు (Birthday Celebrations) నిర్వహించారు. నియోజకవర్గవ్యాప్తంగా బ్యానర్లు, కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. పలు చోట్ల కేకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేపట్టారు. అయితే కాచిగూడ (Kachiguda) డివిజన్ లో ఏర్పాటుచేసిన వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) పాల్గొన్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. భారీగా బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు అక్కడ కట్టిన బెలూన్లపై పడ్డాయి. అలంకరణపై బెలూన్లు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో అందరూ భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ చెదురుముదురుగా వెళ్లిపోయారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో పాటు కొందరు కార్యకర్తలు కింద పడిపోయారు. పక్కన ఉన్న గన్ మెన్లు, పోలీసులు ఎమ్మెల్యేను లేపారు. అనంతరం పోలీసులు స్పందించి మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ గాయాలు కాలేదు.
చదవండి: తెలంగాణకు భూమి దానం ఇచ్చిన భారత క్రికెటర్ అంబటి రాయుడు
వెంటనే పోలీసులు (Hyderabad Police) పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా నిర్వహించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. కాగా హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తం కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. ఆస్పత్రుల్లో రోగులు, వారి బంధువులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానం చేశారు. కొంత మంది రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున సాయంత్రం పెద్ద ఎత్తున జన్మదినోత్సవ కార్యక్రమం చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి మంత్రులు, ఎమ్మెల్యే లు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. కాగా సీఎం కేసీఆర్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.