Hatsap to Sunita:వైఎస్ వివేకానంద (YS viveka) హత్య కేసులో అతని కూతురు సునీత (sunitha) పోరాటాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu rama krishna raju) ప్రశంసించారు. అద్వితీయంగా పోరాడారని, ఇక అవినాశ్ (avinash) అరెస్ట్ తప్పదని ఇండైరెక్టుగా కామెంట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్‌ను సీబీఐ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేయొద్దనే పిటిషన్‌పై ఈ రోజు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు (high court) స్పష్టంచేసింది. ఈ అంశంపై రఘురామ రియాక్ట్ అయ్యారు.
సునీత (sunitha) మడమతిప్పని నైజానికి హ్యాట్సాప్ అని రఘురామ (raghurama) ట్వీట్ చేశారు. వివేకా (viveka) హత్య కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఖాయం అని చెప్పారు. సుప్రీంకోర్టుకు (supreme court) కూడా వెళతారని.. అయినప్పటికీ ఉపయోగం ఉండదన్నారు. హైకోర్టు (high court) తీర్పు ఆర్డర్ రాగానే.. సుప్రీంకోర్టులో (supreme court) పిటిషన్ పడతాయని చెప్పారు. రఘురామ (raghurama) చెప్పినట్టు ఢిల్లీలో సీఎం జగన్‌ను (jagan) అవినాశ్ కలిసిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉండటంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడ ఖాయం అని తెలుస్తోంది.
వివేకా (YS viveka) హత్య కేసును ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు (highcourt) బదిలీ జరిగిందని గుర్తుచేశారు. తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉపయోగం ఉండదన్నారు. మర్డర్ కేసు అయినందున.. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం లేదన్నారు. జగన్ (jagan) కేసులు వాదించే వారే ఈ కేసులు వాదిస్తారని.. సోమవారం కేసు పైల్ చేయొచ్చని రఘురామ సందేహాం వ్యక్తం చేశారు. అయినా నో యూజ్.. పిటిషన్లను కోర్టు కొట్టివేస్తుందని తెలిపారు. ఇలా చెప్పడానికి న్యాయ నిపుణులు కానవసరం లేదరని.. తన అంచనా సరిపోతుందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash) సీబీఐ పలుమార్లు విచారించింది. వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇదివరకు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాయర్ సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని.. ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అప్పుడు సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తాజాగా సీబీఐకి అరెస్ట్ చేయొద్దు అని చెప్పలేం అని పేర్కొంది.