GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతీమా శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వల్లే రాష్ట్రం రెడ్ జోన్లోకి వెళ్లిందని ఆమె విమర్శించారు. అంబటి ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని పేర్కొన్నారు.