AP: పోలవరం మన్యంలో ఆదివాసీలను పెద్దపులి హడలెత్తిస్తోంది. తాళ్లపాలెం-చొప్పరిపాలెం అటవీప్రాంతంలో పులి సంచరిస్తోంది. దీంతో పెద్దపులిని పట్టుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన చేశారు. పులిని పట్టుకుని ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.