AP: మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఇప్పటికే అరెస్ట్ ప్రక్రియ పూర్తికావడంతో ముందస్తు బెయిల్‌కు ఈ పిటిషన్ విచారణ అర్హత లేదని తెలిపింది. అనంతరం ఈనెల 13కు వాయిదా వేసింది.