»Centre Writes To 6 States Amid Rise In Covid 19 Cases
Corona Alert: మళ్లీ కరోనా టెన్షన్..తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు హెచ్చరికలు
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా(Corona) అంతరించిపోతుందనుకున్న సమయంలో మళ్లీ తన పంజా విసురుతోంది. కరోనా పాజిటివ్ కేసులు(Corona Positive Cases) మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తెలంగాణ(Telangana) సహా ఆరు రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు.
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 8 నుంచి 15వ తేది వరకూ దేశ వ్యాప్తంగా చూస్తే 2,082 నుంచి 3,254 కేసులు(Casess) పెరిగినట్లు కేంద్రం గుర్తించింది. ఈ కేసులన్నీ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ తెలిపింది.
అదేవిధంగా అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్(Booster Dose) తీసుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఇకపోతే తెలంగాణ(Telangana)లో చూసుకుంటే గురువారం ఒక్కరోజే 27 కొత్త కేసులు(New Casess) నమోదయ్యాయి. అందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే 12 కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 281 యాక్టీవ్ కేసులు ఉండగా అందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు.