»Not Bat Covid Virus From That Animal Revealed In Latest Study
Corona Virus: కరోనా పుట్టుకపై మరో షాకింగ్ విషయం..ఆ జంతువు నుంచి వైరస్!
కొవిడ్(Covid) పుట్టుకపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ వైరస్ మూలాలు కనుగొనేందుకు పరిశోధకులు ఇంకా తమ పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా(Corona) పుట్టుకపై మరో థియరీ అనేది బయటకి వచ్చింది. అంతర్జాతీయ వైరస్(Virus) నిపుణుల బృందం ఈ కొత్త విషయాలన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా వైరస్(Corona Virus) అనేది రక్కూన్ డాగ్స్ అనే జంతువుల నుంచి వ్యాపించినట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా(Corona) మహమ్మారి ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటి వరకూ కూడా ఈ వైరస్(Virus) ఎలా పుట్టిందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇంకా ఆ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పుట్టుకపై చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా ఎన్నో రకాల థియరీలు వెలుగులోకి వచ్చాయి. కొంత మంది కరోనా వైరస్(Corona Virus) చైనా ల్యాబ్ లోనే పుట్టిందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరికొందరు మాత్రం గబ్బిలాల(Bats) నుంచి వచ్చిందని అంటున్నారు.
కొవిడ్(Covid) పుట్టుకపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ వైరస్ మూలాలు కనుగొనేందుకు పరిశోధకులు ఇంకా తమ పరిశోధనలను సాగిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా(Corona) పుట్టుకపై మరో థియరీ అనేది బయటకి వచ్చింది. అంతర్జాతీయ వైరస్(Virus) నిపుణుల బృందం ఈ కొత్త విషయాలన్ని వెలుగులోకి తెచ్చింది. కరోనా వైరస్(Corona Virus) అనేది రక్కూన్ డాగ్స్ అనే జంతువుల నుంచి వ్యాపించినట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
అట్లాంటిక్ అనే సంస్థ తన నివేదికలో ఈ కొత్త థియరీని ప్రవేశపెట్టింది. 2020 జనవరి నెలలో చైనాలోని వూహన్ మార్కెట్ లో మొట్టమొదటి సారి కరోనా వైరస్(Corona Virus) అనేది బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అందుకే ఆ మార్కెట్ ను మూసినట్లుగా వెల్లడించారు. ఆ ప్రదేశం నుంచి జంతువులన్నింటినీ పంపేసిన తర్వాత పరిశోధకులు అక్కడి గోడలు, ఎడ్లబండ్లు, మెటల్ కేజీల నుంచి అనేక శాంపుల్స్ తీసుకుని పరీక్షించారు.
ఈ పరిశోధనలో ముగ్గురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్(Corona Virus) జన్యు పదార్థాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఎక్కువ మొత్తంలో జన్యు పదార్థం రక్కూన్ డాగ్ కు చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే రక్కూన్ డాగ్ జంతువుకు మానవుల వల్ల వైరస్(Virus) వ్యాపించిందా? లేక ఇతర జంతువుల నుంచి వైరస్ వ్యాపించిందా అనేది తేలాల్సి ఉంది. గతంలో ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అనే వ్యక్తి చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్(Corona Virus) వ్యాపించిందని తెలుపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కొత్త నివేదిక తెరపైకి రావడంతో ఇప్పుడంతా దాని గురించే చర్చించుకుంటున్నారు.