»Snake Photo Snapped Seconds Before Man Brutally Attacked
python attacked: కొండచిలువ క్లోజప్ షాట్ కోసం వెళ్లి….
ఆసిస్ కు చెందిన అన్వేషకుడు, పోటోగ్రాఫర్ (photographer) ఒకరు... భారీ కొండ చిలువను దగ్గరి నుండి క్లోజప్ షాట్స్ తీయాలనే తపనతో దగ్గర వరకు వెళ్లి, క్లిక్ మనిపించాడు.
ఆసిస్ కు చెందిన అన్వేషకుడు, పోటోగ్రాఫర్ (photographer) ఒకరు… భారీ కొండ చిలువను దగ్గరి నుండి క్లోజప్ షాట్స్ తీయాలనే తపనతో దగ్గర వరకు వెళ్లి, క్లిక్ మనిపించాడు. కానీ అంతలోనే ఆ ఫోటో గ్రాఫర్ పైన కొండ చిలువ (python) దాడి చేసింది. జోయి జైన్ అనే వ్యక్తి సాహసోపేత ఫోటో షాట్స్ కోసం ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయినప్పటికీ… గాయాలపాలు కావాల్సి వచ్చింది. కొండ చిలువ దాడి చేసినప్పటికీ అదృష్టవశాత్తూ అతను గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం తప్పింది. ముఖం మొత్తం రక్తసిక్తమైనప్పటికీ, ఆతను చిరునవ్వుతో కనిపించాడు.
కొన్ని మంచి.. సాహసోపేత… క్లిక్స్ కోసం అతను ఉత్సాహంగా కెమెరాను తీశాడు. కొండ చిలువకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశాడు. కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీశాడు. ఈ ఫోటోల ప్రకారం అతనికి కొద్దిగా పైన భయంకరమైన పాము కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా తన వీడియోలో చెప్పాడు. అయితే అతనిని చూసిన ఆ ఎనిమిది అడుగుల పాము జీర్ణించుకోనట్లుగా కనిపిస్తోంది. వెంటనే జోయి జైన్ పైకి దూసుకెళ్లి, ముఖం పైన కొరికింది. అతని తల నుండి రక్తం కారుతున్నట్లుగా కనిపిస్తోంది. అదృష్టవశాత్తూ గాయాలు అంత పెద్దగా కాలేదు. ఆ పాము తన దిశగా వేగంగా కదిలిందని, తనకు ఏమీ కాలేదని అతను చెప్పాడు.
స్నేక్ ఎక్స్ పర్ట్ (Snake expert) డేవిడ్ వాల్టన్ మాట్లాడుతూ… అడవిలోని అతిపెద్ద పాముల వద్దకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. మీకు అలా ఎప్పుడైనా పాములు కనిపిస్తే, వాటిని అలా వదిలేయాలన్నారు. పాములు ఎలాంటి కారణం లేకుండా దాడి చేయవు లేదా కాటు వేయవు అని చెప్పారు. హాని కలిగిస్తుందనే ఆందోళన కలిగినప్పుడు మాత్రమే రక్షణాత్మక ధోరణితో ప్రతిస్పందిస్తాయన్నారు. పాములు వాటి పరిమాణాన్ని బట్టి అవి చదరపు అంగుళానికి 7.8 పౌండ్-ఫోర్స్ శక్తితో సంకోచించగలవని చెప్పారు.