Cyclone Freddy: 326 ప్రాణాలు తీసిన సైక్లోన్, మలావీ అతలాకుతలం
ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఆఫ్రికాలో ట్రాపికల్ సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించడంతో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావీలో భారీ వరదలు సంభవించాయి. దీంతో వందల మంది చనిపోవడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మలావీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అఫైర్స్ తెలిపిన వివరాల మేరకు ఈ సైక్లోన్ 326 మందిని పొట్టన పెట్టుకున్నది. చిలోబ్వే ప్రాంతంలో చాలామంది కనిపించకుండా పోయినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. వేల సంఖ్యలో ప్రజలు తుఫాను సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. 1,83,159 మంది శిబిరాల్లో తలదాచుకున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పాఠశాలను క్లోజ్ చేశారు. ఈ సైక్లోన్ వల్ల వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఆస్తులు, ఇళ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జిలు, రోడ్లు అన్నీ కుప్పకూలాయి.
విమాన శబ్దాన్ని పోలిన భారీ సౌండ్ వచ్చిందని, దీంతో తాను మేల్కొన్నానని, దాదాపు పన్నెండు గంటల సమయంలో తాను ఎత్తైన ప్రాంతాల నుండి అరుపులతో కూడిన ధ్వనిని విన్నట్లు ఓ నలుగురు పిల్లల మహిళ చెప్పారు. ఆ తర్వాత రాళ్లు, చెట్లు, బురదతో కూడిన నీటి ప్రవాహం పర్వతం నుండి జాలువారిందని, తమ ఆస్తులన్నీ కొట్టుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త 2014లో చనిపోయాడని, అప్పటి నుండి కూరగాయల అమ్ముకోవడం వంటి చిన్న వ్యాపారం చేసుకుంటున్నానని, ఈ కొద్ది మొత్తంతో పిల్లలను పోషిస్తున్నాని, ఈ తుఫాను వల్ల తన ఆధారం కూడా పోయిందన్నారు.
అంతకుముందు రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ… మలావి, మొజంబాకి, మడగాస్కర్ ప్రాంతాల్లో సైక్లోన్ ఫ్రెడ్డీ తుఫాను కారణంగా జరిగిన నష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో బాధిత దేశాలకు భారత్ అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికీ భారీ వరదలు, విపరీతమైన గాలుల కారణంగా ముప్పు పొంచి ఉన్నదని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి సైన్యం, పోలీసులను మోహరించారు. దేశంలో రెండు వారాల జాతీయ సంతాప దినాలు, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొజాంబిక్ కు UNCERF 10 మిలియన్ డాలర్ల సహకారాన్ని ప్రకటించింది.