Bapatla: మిగ్జామ్ తుఫాన్ (Cyclone) బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. మధ్యాహ్నం 12.30 గంటలకు తీరాన్ని తాకగా.. 2.30 గంటలకు వెళ్లిపోయిందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ప్రస్తుతం బాపట్లకు (bapatla) నైరుతి దిశలో 15 కిలోమీటర్ల దూరం.. ఒంగోలుకు ఈశాన్య దిశలో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ఉత్తర దిశగా పయనిస్తూ క్రమంగా బలహీన పడుతుంది.
తుఫాన్ (Cyclone) తీరం దాటే సమయంలో బాపట్ల తీరంలో భారీ ఈదురుగాలులతో వర్షం (rain) కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2 మీటర్ల మేర ఎగసి పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆకాల వర్షాలతో (rains) రైతులకు భారీ నష్టం కలిగింది. నెల్లూరు (nellore), ప్రకాశం (prakasam), గుంటూరు (guntur), పల్నాడు (palnadu), ఎన్టీఆర్ (ntr), కృష్ణా (krishna) జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది.
రాయలసీమ కొన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 అడుగుల ముందుకు చొచ్చుకొచ్చింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.