»Cyclone Mocha To Intensify Into Severe Storm By Midnight
Cyclone Mocha: అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా రూపాంతరం, భారీ వర్షాలు
మోఖా తుఫాన్ ఈ అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చనుంది. తుఫాన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బే ఆఫ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Mocha to intensify into severe storm by midnight
Cyclone Mocha:మోఖా (Mocha) తుఫాన్ ఈ అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఈ రోజు ఉదయం తుపానుగా మారింది. ఈ రాత్రికి తీవ్ర తుఫానుగా మారనుంది. దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిక్కులో పయనిస్తూ ఈశాన్య బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మీదుగా 14వ తేదీన తీరం దాటనుంది.
మోఖా (Mocha) తుపాన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బే ఆఫ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మోఖా (Mocha) తుఫాన్ తీరం దాటే సమయంలో 150 కి.మీ నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలించే ప్రక్రియ ఊపందుకుంది.