YS Avinash:ఏపీ సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్‌ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
YS Avinash:ఏపీ సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ( Avinash) ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ (jagan) ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద (viveka) హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి ( Avinash) తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను (jagan) అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్ నివాసంలో అవినాశ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవినాశ్‌తో మాట్లాడిన తర్వాత ప్రధాని మోడీని (modi) కలిసేందుకు జగన్ పార్లమెంట్‌కు వెళ్లారు. ఆ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash) సీబీఐ పలుమార్లు విచారించింది. వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి అవినాష్ రెడ్డి ఇదివరకు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాయర్ సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని కోరారు. సీబీఐ తనకు 150 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని.. ఆ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అప్పుడు సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తాజాగా సీబీఐకి అరెస్ట్ చేయొద్దు అని చెప్పలేం అని పేర్కొంది.
వివేకా హత్య (viveka murder) జరిగిన చోట దొరికిన లెటర్ కీలక సాక్ష్యం అని అవినాష్ (Avinash) అంటున్నారు. ఆ లేఖను సునీత భర్త రాజశేఖర్ దాచారని ఆరోపించారు. హత్య జరిగిన మధ్యాహ్నం వరకు ఎవరికీ ఇవ్వలేదని.. గుండెపోటుతో చనిపోయారని తాను చెప్పలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని చెప్పారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని అవినాష్ అన్నారు. నిందితులతో సీబీఐ కుమ్మక్కైందని.. సునీతకు లీకులు ఇస్తోందని చెప్పారు. 2006 నుంచి వివేకాకు ఓ మహిళతో సంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు పేరు మార్చుకున్నారు. వారికి షేక్ షహన్ షా అనే అబ్బాయి పుట్టాడని చెప్పాడు. రెండో వివాహాం అంటే మొదటి భార్య పిల్లలకు నచ్చదని అవినాష్ చెబుతున్నాడు. వివేకానంద పవర్ ఆఫ్ అటర్నీ కూడా సునీత అండ్ కో లాగేశారని.. ఈ క్రమంలో రెండో భార్య కుటుంబం హత్యకు పాల్పడి ఉండొచ్చని అవినాశ్ రెడ్డి సందేహాం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని చెప్పారు.
అవినాష్ రెడ్డి తండ్రి భాష్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఇటీవల పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో ఇప్పటికే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen)ను విచారించారు.