Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
తెలంగాణ (Telangana) బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ అరెస్ట్ సందర్బంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోగా, ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ (Telangana) బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ అరెస్ట్ సందర్బంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకోగా, ఉద్రిక్తత నెలకొంది. అటు, అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు బీజేపీ (BJP) కార్యకర్తలను అక్కడ్నించి తొలగించే ప్రయత్నంలో తోపులాట జరగ్గా, ఓ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. టీఎస్పీఎస్సీ(TSPSC) చేపట్టిన పలు ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు ఇటీవల లీక్ కావడం సంచలనం సృష్టించింది.
టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యదర్శి (PA Praveen) ఈ లీకేజి వెనుక ప్రధాన సూత్రధారి అని గుర్తించారు. గన్ పార్క్ (Gun Park) పరిసర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. వ్యూ వాంట్ జస్టిస్… కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాల్సిందే…. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనంటూ పెద్ద పెట్టున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద బీజేపీ నేతల అరెస్ట్ దృశ్యాలు కెమెరాలో బంధిస్తున్న టీవీ ఛానల్ లైవ్ లను కూడా పోలీసులు కట్ చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కార్ఖానా పోలీస్ స్టేషన్ (Karkhana Police Station) వైపు తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది.