• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

NLG: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పద్మశాలి సంగం ఆధ్వర్యంలో శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత మాట్లాడుతూ..చేనేత కార్మికుల సంక్షేమం కోసం CM నూతన పథకాలను చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

January 12, 2025 / 04:37 AM IST

ప్రతిభను వెలికి తీసేందుకే ముగ్గుల పోటీలు: ఎస్సై

NLG: పట్టణంలోని 30 వ వార్డు హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ నందు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జహంగీర్ బాబా ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ భాయి ముగ్గుల పోటీలను పరిశీలించారు. ముగ్గుల పోటీలను నిర్వహించడం మహిళల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతో దోహద పడుతుందన్నారు.

January 12, 2025 / 04:30 AM IST

కాంగ్రెస్ సమాధానం చెప్పాలి: ఎమ్మెల్సీ కవిత

NZB: యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ యూత్ నాయకుల దాడిని MLC కవిత ‘X’ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఆమె దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యువతను గూండాయిజం చేసేలా తీర్చిదిద్దుతోందని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై NSUIనాయకుల దాడి, వారి నిజ స్వరూపాన్నిబయటపెట్టిందని మండిపడ్డారు. ఈ సిగ్గుచేటుకాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.

January 12, 2025 / 04:15 AM IST

ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు చోరీ

NZB: ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారును దుండగులు చోరీ చేసినట్లు శనివారం 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఆయన వివరాలు..గౌతమ్ నగర్‌కు చెందిన పవన్ ఈ నెల 9వ తేదీన తన ఇంటి ముందు కారు పార్క్ చేసి హైదరాబాదు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి వచ్చే సరికి పార్కింగ్ చేసిన కారు చోరీకి గురైంది. బాధితుడు 3టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

January 12, 2025 / 04:08 AM IST

నగరంలో భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ

HYD: భూగర్భంలో విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేయడంపై దృష్టి సారించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ తీగల ఏర్పాటు, నిర్వహణపై వివిధ దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

January 12, 2025 / 04:06 AM IST

ప్రజా ప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమంకు హాజరైన భట్టి

KMM: మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమం కు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

January 11, 2025 / 07:47 PM IST

క్రికెట్ పోటీలను ప్రారంభించిన మల్లు నందిని

KMM: బోనకల్ మండల పరిధిలోని ఆళ్ళ పాడు గ్రామంలో శనివారం జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

January 11, 2025 / 07:39 PM IST

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: రూరల్ మండలం పల్లెగూడెం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రెడ్డిపల్లి, వెంకటాయపాలెం, పల్లెగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని సూచించారు.

January 11, 2025 / 07:09 PM IST

ఎమ్మెల్యే కుమార్తెల పుట్టినరోజు.. నిరాశ్రయులకు సాయం

KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కుమార్తెల పుట్టినరోజు వేడుకలను కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులు కుమార్తెలతో కలిసి కేకు కట్ చేశారు. అనంతరం చిన్నారులకు, వృద్ధులకు పాలు, పండ్లను పంపిణీ చేసి, కార్య కర్తలకు స్వీట్లు పంచి పెట్టారు.

January 11, 2025 / 06:49 PM IST

రేపు మండలంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన

NGKL: అమ్రాబాద్ మండలంలో రేపు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అమ్రాబాద్ మండలంలోని మొల్కమామిడి గ్రామంలో గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ముఖ్య అతిథిగా ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొంటారని తెలిపారు.

January 11, 2025 / 06:39 PM IST

బ్యాట్ పట్టిన వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి

WNP: పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో గోనూరి యాదగిరి స్మారకార్ధం వనపర్తి లీగ్ సీజన్-3 క్రికెట్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెఘారెడ్డి పాల్గొని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని, సరదాగా బ్యాటింగ్ చేసి అందరినీ ఆహ్లాదపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మహేష్ పాల్గొన్నారు.

January 11, 2025 / 06:32 PM IST

గంటల వ్యవధిలో దంపతుల మృతి

WGL: గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన బైకాని సోమక్క శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. భార్య మరణ వార్త తెలుసుకొని షాక్కు గురైన భర్త కొమురయ్య సైతం ఈరోజు ఉదయం చనిపోయారు. గంటల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

January 11, 2025 / 06:03 PM IST

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: చేర్యాల పట్టణ కేంద్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను తాడెం రంజిత ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకోవాలన్నారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు.

January 11, 2025 / 05:52 PM IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

JN: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోలు, ఎస్డీసీలు, సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధివిధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించి, అవగాహన కల్పించారు.

January 11, 2025 / 05:31 PM IST

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం మీటింగ్

HYD: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.

January 11, 2025 / 05:16 PM IST