MBNR: పాలమూరు యూనివర్సిటీలోని రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో “సింథసిస్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్” అనే అంశంపై జ్ఞానేశ్వర్ PHD పూర్తి చేశారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ బీసీ అధ్యాపకులు జ్ఞానేశ్వర్‌ను ఘనంగా సత్కరించారు.
MHBD: జిల్లా కేంద్రంలో నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో చేపట్టి మధ్యలో ఆపిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ పథకంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ కార్యకర్తలు నేడు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల స్థలంలో నిరసన తెలిపారు.
NGKL: పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు శనివారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిఅయిన కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
NZB: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని ఎస్సై సందీప్ అన్నారు. కోటగిరి మండలంలోని వల్లభాపూర్ గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 12 సీసీ కెమెరాలను ఎస్సై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.
MBNR: భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫ్యూచర్ క్రికెట్ అకాడమీని శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు మంచి నైపుణ్యంతో కూడిన క్రికెట్ శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు తెలిపారు. కొద్దిసేపు స్వయంగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
BHNG: వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, రాజారామ్, చిన్నా నాయక్, వైద్య అధికారులు పాల్గొన్నారు.
SRPT: మట్టంపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ కోటాచలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్‌ను తనిఖీ చేసి విధులకు హాజరు కానటువంటి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని సూచించారు. సాదారణ కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
SDPT: యువత దావత్తులు బంద్ చేసి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాలని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో పవన సుత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే అన్నారు.
KMR: కడుపు నొప్పి భరించలేక మహిళ పురుగుల మందు సేవించి ఈనెల 12న ఆత్మహత్యాయత్నం చేస్తుందని ఎస్ఐ రంజిత్ తెలిపారు. సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన కోరబోయిన రాజమణి(57) మహిళ పురుగుల మందు సేవించగా ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
NRML: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక దీక్షలో పాల్గొన్న కస్తూరిబా పాఠశాలల బోధనేతర సిబ్బంది తిరిగి తమ విధులలో శనివారం సాయంత్రం చేరారు. ఇందులో భాగంగా డీఈఓ రామారావును వారి కార్యాలయంలో కలిసి విధులలో చేరుతున్నట్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. బోధనేతర సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
KNR: కరీంనగర్ పట్టణం రాజారాం కాలనీలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటరమణ బుట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.
KMR: బీర్కూర్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ సింధు శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
KNR: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల వసతులను పరిశీలించారు. ఆయా విభాగల రిజిస్టర్లు పరిశీలించి, అందిస్తున్న వైద్య సేవలు, వార్డులలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల వివరాలు తెలుసుకున్నారు.
HYD: కుల్సంపుర పోలీసులు ఘరానా దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ నెల 24న జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు అడ్డుకుని, అతడిపై దాడి చేసి ఆయన బైక్‌తో పరారయ్యారు. బాధితుడు కుల్సంపుర పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
NRML: భిక్షాటన నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని బాలల సంక్షేమ కమిటీ కార్యాలయాన్ని వారు సందర్శించారు. జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, బాల్యవివాహాల నియంత్రణ, అనాధ బాలల గుర్తింపు తదితర అంశాలపై సీడబ్ల్యుసీ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు.