• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో 1,91,092 మంది రైతులకు రైతు భరోసా

భద్రాద్రి జిల్లాలో యాసంగిలో 23 మండలాల్లోని 963 గ్రామాలకు చెందిన 1,91,092 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమకానుంది. ఈ మేరకు జిల్లాకు రూ. 337.17 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2000 మందికిపైగా రైతులు కొత్తగా రైతు భరోసా కోసం నమోదు చేసుకున్నారు. ఇంకా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనున్నారు.

March 23, 2026 / 08:13 AM IST

కాంగ్రెస్‌లో చేరిన గంభీరావుపేట సర్పంచ్

SRCL: గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు పద్మ నర్సాగౌడ్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ జడ్పీటీసీ మల్లు నర్సాగౌడ్ సతీమణి అయిన పద్మ ఇటీవల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ అత్యధిగా మెజారిటీతో గెలుపొందారు. సంగీతం శ్రీనివాస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

March 23, 2026 / 08:11 AM IST

రైతులు పంట మార్పిడి చేసుకోవాలి: మంత్రి

SDPT: రైతులు పంటమార్పిడి చేసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఉపయోగించుకోవాలని, రైతులు వరి పంట నుంచి ఆయిల్ పామ్‌కు మారాలని, ఆయిల్ పామ్‌లో మూడేళ్లు అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు.

March 23, 2026 / 08:10 AM IST

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వనపర్తి వాసి

WNP: బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీ. అరవింద్ స్వామి నియమితులయ్యారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, సామాజిక సమస్యలపై పోరాడుతారని సభ్యులు ఆకాంక్షించారు.

March 23, 2026 / 08:10 AM IST

నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. జిల్లా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా కలెక్టరేట్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 08:08 AM IST

నేటి నుంచి వార్డు సభ్యులకు ట్రైనింగ్

ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలకు గాను మరప్పగూడ, నాగల్కొండ, బలాన్పూర్, బేతల్ గూడ, మాన్కపూర్, నార్నూర్, భీంపూర్, కొత్తపల్లి, మలంగి, మాలేపూర్, ఉమ్రి జీపీల వార్డు సభ్యులకు సోమవారం నుంచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఈనెల 28వ తేదీన శిక్షణ ముగియనుందన్నారు. నార్నూర్ రైతువేదికలో నిర్వహించే 5 రోజుల ట్రైనింగుకు రావాలన్నారు.

March 23, 2026 / 08:08 AM IST

FLASH: ఉప్పల్ బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

MDCL: ఉప్పల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలను ఉప్పల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. చిలుకానగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నేత తెలంగాణ సంపత్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యలతో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 23, 2026 / 08:07 AM IST

బురద మయంగా మారిన రోడ్డు

KNR: ఇల్లందకుంట మండలం సిరిసేడు-మాల్యాల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో రైతులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గతంలో మంజూరైన 2.5 కి.మీ తారు రోడ్డు పనులు పూర్తి కాకముందే నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు పూర్తయితే ప్రయాణికులకు 3 కి.మీ ప్రయాణ భారం తగ్గుతుంది.

March 23, 2026 / 08:06 AM IST

నేడు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం

ASF: వినియోగదారుల సౌలభ్యం కోసం సోమవారం జిల్లా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా SE ఉత్తమ్ జాడే ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఫిర్యాదులు స్వీకరించి సమస్యల తీవ్రతకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు.

March 23, 2026 / 08:06 AM IST

నేటి నుంచి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

SRPT: సమగ్ర శిక్ష పథకం కింద సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై నేటి నుంచి 25 వరకు నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు డబ్బు విలువ, పొదుపు అలవాట్లు, బాధ్యతాయుతమైన ఆర్ధిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలనేది దీని ఉద్దేశం.

March 23, 2026 / 08:05 AM IST

పెఱిక యువజన సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా సాగర్

మంచిర్యాల జిల్లా పెఱిక యువజన సంఘం ఎన్నికలలో బెల్లంపల్లి పట్టణనికి చెందిన బోడకుంట సాగర్‌ని జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వనికి, జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

March 23, 2026 / 08:04 AM IST

చలో అసెంబ్లీ పిలుపు.. బీజేపీ నేతల అరెస్ట్

KMM: చింతకాని మండలంలో సోమవారం తెల్లవారుజామున బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపుతో కాంగ్రెస్ హామీల అమలుపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మండల అధ్యక్షుడు కొండా గోపి, ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్యను పోలీసులు ఇంటివద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

March 23, 2026 / 08:04 AM IST

ఈనెల 25న బల్దియా బడ్జెట్: మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అకౌంటింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు. ఈనెల 25న బడ్జెట్ ఆమోదం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకవర్గం పదవీకాలం మరో నెలలో ముగియనున్న నేపథ్యంలో ఇది చివరి బడ్జెట్ సమావేశంగా నిలవనుంది.

March 23, 2026 / 08:00 AM IST

ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

NZB: రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

March 23, 2026 / 07:55 AM IST

పదహారు ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మురళి, ఆంజనేయులు, శేఖర్, భారత్, నరేష్, శశికాంత్ తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.

March 23, 2026 / 07:49 AM IST