KMM: తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి ప్రస్తావించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలిపారు.