AP: వైసీపీకి రాజీనామా చేసిన జకియా ఖానం బీజేపీలో చేరారు. BJP రాష్ట్రాధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీ నుంచి తప్పుకున్న జకియా.. కమలం గూటికి చేరారు. కాగా, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం.. 2021లో శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.