NRPT: పస్పుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ దేవాలయ నిర్మాణంతోపాటు విగ్రహానికి దాత రూ.51 వేలు అందజేశారు. మరికల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన నర్సింహులు బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు తండ్రి లింగప్ప జ్ఞాపకార్థం అందించినట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచి 23 వరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.