HYD: భార్యను భర్త హత్య చేసిన ఘటన బాలాపూర్‌లో కలకలం రేపింది. పోలీసుల కథనం.. దంపతులు నజియాబేగం, జకీర్ న్యూ గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. గతంలో వీరు గోల్కొండ ప్రాంతంలో ఉండేవారు. కొద్ది రోజులుగా జకీర్‌కు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విచక్షణా రహితంగా ఆమెను కొట్టి చంపాడు. ఉదయం అత్త రుబీనాకు చెప్పి పారిపోయాడు.