ఢిల్లీలో ఏఐసీసీ ముఖ్య నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. భారత్-పాకిస్తాన్ వివాదంలో అమెరికా జోక్యంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.