ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం జూన్ 4న ప్రారంభం కానుంది. ఈ శిక్షణ మార్కెట్ యార్డ్లో నిర్వహించనున్నారు. మహిళలలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలని అధికారులు సూచించారు.